విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సిని మా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నా రు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్స్ బా బీ, సందీప్ రాజ్, శైలేష్ కొలను, బీవీఎస్ ర వి, ప్రొ డ్యూసర్ లగడపాటి శ్రీధర్ ముఖ్య అ తిథులుగా పా ల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ మాట్లాడు తూ “సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ చాలా బాగుంది. ఇలాంటి ముఖ్యమైన సబ్జెక్ట్‌ను అందరికీ నచ్చేలా చె ప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు తప్పకుండా స క్సెస్ దక్కుతుంది”అని తెలియజేశారు.
లెలేక్టర్ సం జీవ్‌రెడ్డి మాట్లాడుతూ – “అన్నీ బా గుండి లైఫ్‌స్టైల్ వ ల్ల సంతాన లేమితో బాధపడేవారిని ఈ మూవీలో చూపించాం. ట్రైల ర్ చూస్తే మంచి లవ్ స్టోరీ ఉంది, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ ఉన్నాయి. వాటితో పా టు చిన్న సందేశం కూడా ఉంది. ఇదే మా సినిమా”అని అన్నారు. నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడు తూ “- ఈ చిత్రంతో ఒ క మంచి ప్రయత్నం చేశాం. ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న ఒక క్లీన్ ఫ్యామిలీ మూవీ నిర్మించాం. మా సినిమాను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా”అని తెలిపారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ “ఒక సున్నితమైన సమస్యను తీసుకుని దా నికి వినోదాన్ని జతచేసి రూపొందించిన చిత్రమిది. మూవీ చివరలో మంచి భావోద్వేగం, సందేశంతో ప్రే క్షకులు థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. సిని మా విజయంపై నమ్మకంగా ఉన్నాము” పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి, హీరోయిన్ చాందినీ చౌదరి, అజయ్ అరసాడ, కాసర్ల శ్యామ్, షేక్ దావూద్.జి, బాలవర్థన్, కల్యా ణ్ రాఘవ్, మురళీధర్ గౌడ్ పాల్గొన్నారు.