చెన్నై: తమిళనాడు రాష్ట్రం శివగంగ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుప్పువనమ్‌లోని సక్కుడిలో ద్విచక్రవాహనాన్ని పోలీసులు వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడడంతో మదురైలోని ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంజియూర్ లోని బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన ప్రసాద్, సత్య అనే దంపతులు, కూతరు అశ్విన్ గా గుర్తించారు. గాయపడిన మహిళ పేరు ఈశ్వర్ గా గుర్తించారు. మృతులు మేలురు ప్రాంతంలోని చిత్తపాటి గ్రామానికి చెందిన వారు అని పోలీసులు వెల్లడించారు.