హైదరాబాద్: రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కఠినతరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఆయన రవాణాశాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో 3 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై భారీగా పెనాల్టీ విధించాలని.. ఓవర్‌లోడింగ్ వాహనాలు సీజ్ అయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్ సేప్టీ మంత్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. మహిళ ఆటోలకు అనుమతులిచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు.