అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి – వైసిపి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైసిపి మెడికల్ కాలేజీల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి కార్యక్రమాలు ఉన్నందున మరో చోట కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని వైసిపి నేతలకు పోలీసులు సూచించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి యాడికి మండల కేంద్రంలో ర్యాలీకి ఏర్పాట్లు చేసుకున్నారు. తాడిపత్రిలోని ఇంటి వద్దే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. టిడిపి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి మరో చోట కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. పోలీసుల సూచనతో యాడికి మండల కేంద్రానికి వైసిపి కార్యక్రమం మార్చుకున్నారు.