దేశ రాజదాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిని వారిని ప్రధాని మోడీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకొని బుధవారం తిరిగొచ్చిన ప్రధాని మోడీ.. నేరుగా ఎల్ఎన్ జెపి ఆసుపత్రికి వెళ్లి బాధితులకు కలిశారు. ఈ సందర్భంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి అధికారులు, వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనపై మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కేంద్ర క్యాబినెట్ కమిటీ పాల్గొననుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో పేలుడు ఘటనలో తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.