తిరుపతి: కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా కపిలతీర్థం పుష్కరిణీ వద్ద భక్తుల నిరసన తెలిపారు. స్నానం ఆచరించేందుకు అనుమతించడం లేదని టిటిడి వైఖరిపై భక్తులు మండిపడుతున్నారు. టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు డౌన్ డౌన్, ఇఒ డౌన్ డౌన్ అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఎందుకు స్నానానికి రానివ్వడంలేదని ప్రశ్నించారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అయ్యప్ప భక్తులు వాపోతున్నారు.