గత పది రోజుల వరకు రాష్ట్రాన్ని తడిచి ముద్ద చేసిన వర్షాలు తగ్గాయనే లోపే చలి పంజాతో రాష్ట్రాన్ని వణికిస్తుంది. గత రెండు రోజులుగా చలి తీవ్రరూపం దాల్చడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు) కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమొదయ్యాయి. ఆదిలాబాద్‌లో 10.2 డిగ్రీలు, రాజన్న సిరిసిల్లలో 11.5, నిర్మల్‌లో 11.7, నిజామాబాద్‌లో 11.8, వికారాబాద్‌లో 12.0, సంగారెడ్డిలో 12.1, కామారెడ్డిలో 12.2, జగిత్యాలలో 12.5, మెదక్‌లో 12.8, సిద్దిపేటలో 13.3, రంగారెడ్డి,
కరీంనగర్‌లో 13.4న, మంచిర్యాలలో 13.6, పెద్దపల్లిలో 13.7, మహబూబ్‌నగర్‌లో 14, నారాయణపేటలో 14.1, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లిలో 14.4, యాదాద్రి భువనగిరిలో 14.7, జనగాంలో 14.8, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 14.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు రాష్ట్ర డెవలెప్‌మెంట్ ప్రణాళికా సంఘం వెల్లడించింది.దీంతో పాటు రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉంటాయని పేర్కొంది. చలి తీవ్రత దృష్టా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.