ఎపిలోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో మంగళవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్లిన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో నలుగురు యువకులు దుర్మరణం చెందగా. పోలీసుల ప్రాథమిక విచారణలో అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైం దని పోలీసులు వెల్లడిం చారు. ప్రమాదం తీవ్రతను బట్టి కారు వేగం 120 కి.మీ.లకు పైగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు చింతయ్య (17), రాకేష్ బాబు (24), ప్రిన్స్ (24) సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.
మరో యువకు డుకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బాధితుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని వాహనం శకలాల్లో చిక్కుకున్న బాధితులను బయటకు తీయడానికి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఉయ్యూరు పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ప్రమాదం కారణాలపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభమైందని సిఐ వెల్లడించారు.