అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో విలేఖరిపై టిడిపి నేత దాడికి పాల్పడ్డాడు. రోడ్డు నిర్మాణ అక్రమాలపై వార్త రాసినందుకు టిడిపి నేత దాడి చేశాడని ఓ పత్రిక విలేఖరి శంకర్ తెలిపాడు. టిడిపి నేత నాగరాజు యాదవ్ అనే వ్యక్తి తొలుత ఫోన్ లో బెదిరించి అనంతరం కర్రలు, బెల్టుతో దాడి చేశాడు. పద్ధతి మార్చుకోకపోతే అంతు చూస్తానని బెదిరింపులకు దిగారు. టిడిపి నేత నాగరాజు యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలోలో జరగడం గమనార్హం