రెండు తెలుగు రాష్ట్రాలలో వరుస బస్సు ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికారులు ఒకవైపు, బస్సు ప్రమాదాలతో విషాద ఛాయలు చోటు చేసుకుంటున్న వేళ అధికారులు ప్రమాదాల నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నప్పటికీ ,వాహన డ్రైవర్ల నిర్లక్షంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, సంబంధిత అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టకపోవడమే ప్రమాదాలకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం హైద్రాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై లింగోటం వద్ద జరిగిన సంఘటనలో లారీ డ్రైవర్ సమయస్ఫూర్తితో విద్యార్థులకు ప్రాణహాని తప్పింది.లింగోటం వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టకుండా లారీ డ్రైవర్ దారిమళ్లించడంతో , లారీ అక్కడే బోల్తా పడగా,లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.
లారీ డ్రైవర్ వ్యవహరించిన తీరుతో సుమారు 15మంది విద్యార్థులు ప్రాణాలతో బయటపడటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.మహారాష్ట్రనుండి ఉల్లిగడ్డ లోడ్‌తో లారీ హైద్రాబాద్ మీదుగా విజయవాడ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించి,విద్యార్థులకు ప్రాణ హాని కాకుండా కాపాడింనందు నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతి కుమార్‌తోపాటు పలువురు అధికారులు లారీ డ్రైవర్‌ను అభినందించారు.గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.ఏది ఏమైనప్పటికీ సంబంధిత అధికారులు జాతీయ రహదారిపై గట్టి నిఘా పెట్టాలని,నిబంధనలు ఉల్లంఘిచిన వాహనాల డ్రైవర్లు,యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.