దర్శకధీరుడు రాజమౌళి- సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘‘#SSMB29’’. నవంబర్ 15న ఈ మూవీ టైటిల్ తోపాటు వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం మేకర్స్, అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సిినిమాలో హీరోయిన్ శ్రుతిహాసన్ పాడిన పాటను కొద్దిసేపటిక్రితం రిలీజ్ చేశారు. ఈ ఆడియో సాంగ్ ఆకట్టుకుంటోంది.
కాగా, ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి.. అప్డేట్స్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ రాజమౌళి.. రామోజీ ఫిలీం సిటీలో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మహేష్, హీరోయిన్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తోపాటు తదితరులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈవెంట్ కు ముందే మేకర్స్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. గత శుక్రవారం ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘కుంభ’ అనే పాత్రలో కనిపించనున్న పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.