న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర లు మళ్లీ ఊపందుకుంటున్నాయి. సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకస్మికంగా పెరిగాయి. అమెరికా డాలర్ బలపడడం, పసిడికి డిమాండ్ తగ్గడం వల్ల అం తర్జాతీయ మార్కెట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం 4 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,220గా ఉంది, ఇది క్రితం రోజు 1,22,020తో పోలిస్తే రూ.1,200 పెరుగుదలను చూసిం ది. 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ. 1,12,950గా ఉంది, ఇది క్రితం రోజు రూ.1,11,850తో పోలిస్తే రూ.1,100 పెరిగింది.
మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2500 పెరిగి రూ.1,55,000కు చేరుకుంది. క్రితం రోజు ఇది రూ. 1,52,500గా ఉందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) తెలిపింది. వే2వెల్త్ బ్రోకర్స్ రీసెర్చ్ అనలిస్ట్ అభిషేక్ ఎం పెలు ప్రకారం, ఎంసిఎక్స్ గోల్డ్ ప్రస్తుతం కన్సాలిడేషన్ జోన్‌లో ఉందని, తక్షణ నిరోధకం రూ.1,22,145 వద్ద, మద్దతు రూ.1,19,150 వద్ద ఉంది. బంగారం ధరలు బలహీన ధోరణిలోనే ఉన్నందున ట్రేడర్లు రూ.1,21,630 వద్ద అమ్మకాలు పరిగణించవచ్చు అని ఆయన అన్నారు. ఐసిఐసిఐ డైరెక్ట్ విశ్లేషణ ప్రకారం, ఎంసిఎక్స్ గోల్డ్ డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.1,20,000 స్థాయి పైన ఉంటే రూ.1,22,000 వరకు పెరిగే అవకాశం ఉంది.
అదే విధంగా ఎంసిఎక్స్ సిల్వర్ డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.1,46,000 పైన ఉంటే రూ.1,50,000 వరకు జంప్ చేసే అవకాశం ఉంది. నిర్మల్ బాంగ్ సెక్యూరిటీస్ విశ్లేషకుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ఆర్థిక బలహీనత, గవర్నమెంట్ షట్‌డౌన్‌పై అనిశ్చితి వల్ల గోల్డ్ డిమాండ్ పెరుగుతోంది. ఐసిఐసిఐ డైరెక్ట్ రీసెర్చ్ ప్రకారం, స్పాట్ గోల్డ్ 4,080 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక మందగమనం, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బంగారానికి మద్దతు ఇస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.