మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం మొ త్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక పో లింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం (నవంబర్ 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పో లింగ్ జరుగనుంది. సాయంత్రం 6 గంట ల లోపల కేంద్రంలోకి వచ్చే ప్రతి ఒక్క ఓట రు.. ఎంత రాత్రి అయినా ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. ఎన్నిక కోసం 2,394 ఇవిఎంలు, 595 వీవీప్యాట్లు, 561 కం ట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఇవిఎంలలో సమస్య వస్తే వెంటనే సరిచేయడానికి పెద్ద ఎత్తున ఇంజినీర్లను అందుబాటులో ఉంచారు. ఉప ఎన్నికకు 139 ప్రాంతాలలో 407 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించారు.
ఈ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆయా కేంద్రాలలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక లో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ని ర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో షామియానాలతో పా టు వికలాంగులు, వృద్ధులకు వీల్ ఛైర్లనూ ఏర్పా టు చేస్తున్నారు. తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణతో పాటు ఓటర్లకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టింది.
మొత్తం ఓటర్లు 4,01,365 మంది
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లుండగా.. అందులో 2,08,561 మంది పురుషులు.. 1,92,779 మంది మహిళలు.. ఇతరులు 25 మంది ఉన్నారు.18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు 6,859 మంది ఉండగా 80 ఏళ్లు పైబడిన వారు 6,053 మంది 85 ఏళ్లు పైబడిన వారు 2,134 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే వృద్ధులకు సంబంధించిన హోమ్ ఓటింగ్‌లో దరఖాస్తు చేసుకున్న 103 మంది తమ హక్కు వినియోగించుకున్నారు.
58 మంది అభ్యర్థులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ నియోజకవర్గానికి ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లో 58 మంది పోటీ చేయడం ఇదే తొలిసారి. 2023లో జరిగిన ఎన్నికల్లో 19మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది. ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. యాప్ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదవుతుందని తెలిపారు.
కట్టుదిట్టమైన భద్రత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా 1,761 మంది రాష్ట్ర పోలీసులు, 8 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. 45 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 45 స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, 4 వీడియో సర్వలెన్స్ టీమ్‌లు, 4 వీడియో వ్యూయింగ్ టీమ్‌లు, రెండు అకౌంటింగ్ బృందాలు పని చేయనున్నాయి.
68 కేంద్రాల వద్ద సిఆర్‌పిఎఫ్‌తో భద్రత : సిఇఒ సుదర్శన్‌రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిఆర్‌పిఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఎన్నికలో మొదటిసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 24 గంటలపాటు అందుబాటులో ఉండే కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఎలాంటి ఇబ్బందులు 1950 నెంబర్ ఫోన్ చేసిన ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఈ ఎన్నిక కోసం 2060 మంది ఎన్నికల సిబ్బంది, 2000 మంది పోలీసు సిబ్బంది పనిచేయబోతున్నట్లు చెప్పారు. వెబ్ కాస్టింగ్ ఉంటుందని, ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నిఘా పెడతామని తెలిపారు.