చేగుంట మండలం జేత్రాం తండా గొడుగుపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత కనిపించడంతో చుట్టు ప్రక్కల ప్రాంత తండాలో ప్రజలు ,మేకల కాపరులు భయాందోళనలో ఉన్నారు. చేగుంట మండలంలోని దౌల్తాబాద్ మండల శివారులోని అటవీ ప్రాంతంతో ఈ రోజు ఉదయం పశువులను మేపడానికి వెళ్లిన వారు చిరుతను చూసి 100కు డయల్ చేయడంతో పోలీసులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. చిరుత ఉందని తెలిసి చూడడానికి అటవికి కొంతమంది పశువుల, మేకల కాపరులు వెళ్లగా అటవీ అధికారులు ఎవరు ఉండకూడదని నిద్రలో ఉంది అదే లేచి వెళ్ళిపోతుంది లేదా పై అధికారులతో మాట్లాడి ఎమి చేయాలో చూస్తాం రెండు మూడు రోజులు ఇటు అడవిలో ఎవరు తిరుగ వద్దని తెలిపారు.