హైదరాబాద్: కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎస్ఇసిని బిఆర్ఎస్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్యాత్మక కేంద్రాల వద్ద బలగాలను పెంచాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. మిక్సీలు, గ్రైండర్లు, చీరలు పంచుతున్నారని, మంగళవారం పోలీంగ్ లో దొంగఓట్లు పడే అవకాశం ఉందని హరీశ్ రావు తెలియజేశారు. జూబ్లీహిల్స్ లో మద్యం ఏరులై పారుతోందని, ఫేక్ ఓటర్ ఐడిలు పంచుతున్నారని విమర్శించారు. ఇసికి వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేశామని, కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని హరీశ్ రావు మండిపడ్డారు.