ఆస్ట్రేలియాతో టి-20 సిరీస్‌లో విజయం తర్వాత భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే ఈ మేరకు ఇప్పటికే జట్టు సభ్యులు అంతా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చే ఏడాదిలో జరిగే టి-20 ప్రపంచకప్ గురించి ఇప్పటి నుంచే జట్టు సభ్యులు సిద్ధంగా ఉండాలని.. సూచనలు చేశారు. జట్టులో ఉండే ప్రతీ ఒక్కరు ఫిట్‌గా ఉండలని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని బిసిసిమా సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేసింది.
అందులో గంభీర్ మాట్లాడుతూ.. ‘‘మా డ్రెస్సింగ్ రూం పారదర్శకంగా ఉంటుంది. ఇది అలాగే కొనసాగాలి. టి-20 ప్రపంచకప్ కోసంమేం పూర్తిగా సన్నద్ధం కావాలి. మన చేతిలో ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రాముఖ్యతను ఆటగాళ్లు అందరూ తెలుసుకోవాలి’’ అని అన్నారు. ఇక 2026 టి-20 ప్రపంచకప్ భారత్, శ్రీలంక వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లు 2026. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ జరిగే అవకాశం ఉంది.