తిరువనంతపురం: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన నెటిజన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా తన మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తున్న వారి పై కేరళలో సైబర్ క్రైమ్ పోలీసులకు అనుపమ ఫిర్యాదు చేశారు. తమిళనాడుకు చెందిన ఓ 20 ఏళ్ల అమ్మాయి దీని వెనుక ఉందని, తనకు తెలిసిన వ్యక్తులను కూడా ఆ పోస్ట్ లకు ట్యాగ్ చేశారని వివరించింది. ఈ విషయం పై ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక పోస్ట్ పెట్టింది. తనని ట్రోల్ చేసిన అమ్మాయి వయస్సు 20 ఏళ్ళు మాత్రమే కావటంతో ఆమె గుర్తింపును బహిర్గతం చెయ్యొద్దని పోలీసులను విన్నవించింది. తనకు సంబందించిన ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు తన గురించి నీచంగా రాసిందని ఫిర్యాదులో పేర్కొంది. వీటితో తనను ఆన్ లైన్ లో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడింది. ఫేక్ ఎకౌంట్ సృష్టించి మార్ఫింగ్ ఫొటోలు సోషల్ పోస్టు చేయడం మంచిది కాదని హెచ్చరించారు.