సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం హాషిం ఆమ్లా దన ధృష్టిలో అల్‌టైమ్ అత్యుత్తమ వన్డే క్రికెట్ జట్టును ప్రకటించాడు ఈ జట్టులో ముగ్గురు భారతీయులకు చోటు ఇచ్చిన ఆమ్లా టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు మొండి చెయ్యి చూపించాడు. తొలుత ఓపెనర్లుగా టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆసీస్ మాజీ ఆటగాడు ఆడం గిల్‌క్రిస్ట్‌లను ఎంచుకున్నాడు. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ.. నాలుగు ఐదు స్థానాల్లో బ్రియన్ లారా, ఎబి డివిలియర్స్.. ఆరో స్థానంలో తన సహచర క్రికెటర్ జాక్వెస్ కలిస్‌ని ఎంపిక చేశాడు. ఏడో స్థానానికి ఎంఎస్ ధోనీని ఎంచుకున్నాడు. ఇక బౌలర్లలో ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లకు చోటు ఇచ్చాడు. పేసర్లుగా వసీం అక్రమ్, డేన్ స్టెయిన్ లను, స్పిన్నర్లుగా ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్‌లను ఎంపిక చేసుకున్నాడు ఆమ్లా.