అమెరికాలో ఎపికి చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నవంబర్ 7న యార్లగడ్డ చనిపోయినట్లు తెలుస్తోంది. యార్లగడ్డ రాజ్యలక్ష్మి టెక్సాస్‌లోని ఎ అండ్ ఎమ్ యూనివర్సిటీ-కార్పస్ క్రిస్టి నుంచి పట్టభద్రు రాలు. అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఇంతలోనే మృత్యువు వెంటాడింది. నవంబర్ 7వ తేదీన నిద్రలోనే ఆమె చనిపోయిన ట్లుగా తెలుస్తోంది. ఉదయాన్నే లేపగా మేల్కోకపోవడంతో స్నేహితులు గుండెలు బాదుకుంటూ ఏడ్చేశారు.
రెండు, మూడు రోజులగా తీవ్రమైన ద గ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతుందని బంధువు చైతన్య వెల్లడించారు. ఇక మృతదేహాన్ని ఎపికి పంపించేందుకు చైతన్య టెక్సాస్‌లో నిధులు సేకరిస్తు న్నారు. రాజ్యలక్ష్మిది ఆంధప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని కర్మెచెడు గ్రామం. తల్లిదండ్రులు అన్నదాతలు. ఎన్నో కలలతో అమెరికాకు పంపినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఆమె మరణానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అక్కడి అధికారులు శవపరీక్ష నిర్వహిస్తున్నారు .