లండన్: టీమిండియా యువ సంచలనం, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. టి20 ఫార్మాట్‌లో అభిషేక్‌ను మించి ఓపెనర్ ఎవరూ లేరని పేర్కొన్నాడు. పొట్టి క్రికెట్‌లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడన్నాడు. ఎంత పెద్ద బౌలర్‌కైనా చుక్కలు చూపించే సత్తా అతనికుందన్నాడు. రానున్న రోజుల్లో వన్డేల్లోనూ అతను మెరుగైన ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నా ఆశ్చర్యం లేదన్నాడు.
అతి చిన్న వయసులోనే అభిషేక్ అగ్రశ్రేణి ఓపెనర్‌గా ఎదగడం టీమిండియాకు అతి పెద్ద ఊరట అని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో అతను టి20 ఫార్మాట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకోవడం ఖాయమన్నాడు. అతని బ్యాటింగ్ తీరు ఎంతో ఆకట్టుకుంటుందన్నాడు. భారత్‌కు లభించిన అత్యుత్తమ ఓపెనర్లలో అభిషేక్ ఒకడని, అతనికి ఎంతో భవిష్యత్తు ఉందని పీటర్సన్ పేర్కొన్నాడు.