బెంగళూరు: సౌతాఫ్రికాతో జరిగే అసలు పోరుకు ముందు భారత్ ఎ జట్టు సఫారీ ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా జరిగిన రెండో అనధికారిక టెస్ట్‌లో భారత్ ఎ జట్టు ఓటమిపాలైంది. 417 పరుగుల విజయలక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా ఎ జట్టు ఇవాళ ఒక్కరోజే 392 పరుగులు చేయడం గమనార్హం. 25/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో బోర్డాన్ హెర్మాన్ 91, లెసెగో సెనోక్వానే 77, జుబైర్ హంజా 77, తెంబా బావుమా 59, కానర్(నాటౌట్) 52 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 సిరాజ్, ఆకాశ్ దీప్, హర్ష్ దూబె తలో వికెట్ తీశారు.