దుండిగల్‌లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. మెదక్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన స్వాతి (28) అనే మహిళ శనివారం దుండిగల్‌లో హత్యకు గురైంది. స్వాతిని నిందితులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో నిందితులు రాజేశ్, వంశీ, కిషన్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధమే స్వాతి హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కిషన్‌తో స్వాతి సన్నిహిత సంబంధం పెట్టుకుంది.. అప్పటికే పెళ్లైన కిషన్‌ను తనను రెండో పెళ్లి చేసుకోవాలని ఇంటి యజమానిపై స్వాతి ఒత్తిడి పెంచింది. స్వాతిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకనే కిషన్ ఆమెను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ జరిగింది. రాజేశ్, వంశీ అనే ఇద్దరితో స్వాతిని హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి.. కత్తి, కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.