హైదరాబాద్: అప్పుడప్పుడు పాత వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి, యాంకర్ రష్మీ గౌతమికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2007లో రాజమౌళి యమదొంగ సినిమాతో సినీ రంగంలో ప్రవేశించారు. అక్కడి నుంచి విక్రమార్కుడు, సింహాద్రి, ఛత్రపతి, మర్యాదరామన్న, ఈగ, మగధీర, బాహుబలి, బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. బహుబలి సినిమాతో భారత దేశపు సినిమా ప్రపంచానికి తెలియజేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించార. తన కెరీర్ ప్రారంభంలో నేరుగా సినిమా ద్వారా కాకుండా సీరియల్స్‌తో ప్రారంభించారు అనే చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. గతంలో రష్మీ, రాజమౌళి ఒక సీరియల్ నటించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో రష్మీ కంట్లో పడడంతో హీరో నాగార్జునను ఒక కోరిక కోరింది. రష్మీ-రాజమౌళి ఎప్పుడు కలిసి నటించారని అభిమానులు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. యువ సీరియల్ నుంచి తనకు చాలా మంచి మెమొరీలు ఉన్నాయని, సీరియల్ యూనిట్‌తో రీయూనియన్ ఎపిసోడ్ చేయాలని ఉందని నాగార్జునను యాంకర్ రష్మీ కోరింది. రాజమౌళి దర్శకధీరుగా ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారు. రష్మీ మాత్రం పలు టీవీ షోలలో యాంకర్‌గా దూసుకుపోతుంది. రష్మీతో రాజమౌళి యువ సీరియల్ లో నటించారు.