హైదరాబాద్: గుజరాత్‌లో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ ఎటిఎస్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రకు ప్రయత్నించిన హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌తో పాటు మరో ఇద్దరిని గుజరాత్ ఎటిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొహియుద్దీన్ ఫ్రాన్స్‌లో ఎంబిబిఎస్ చేసినట్లు గుర్తించారు. ఆదివారం అతడి నివాసంలో సోదాలు జరిపిన గుజరాత్ పోలీసులు.. రెండు గ్లాక్ పిస్టల్స్, 1 బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. మొహియుద్దీన్ ఐఎస్‌కెపి సభ్యులతో చర్చలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా.. ఈ నెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.