హైదరాబాద్: బిఆర్ఎస్ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉరివేసే ఖైదీని చివరి కోరిక అడుగుతారు. కానీ తనకు షోకాజ్ నో నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. హనుమకొండలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు తనపై ఆంక్షలు పెట్టారని, ప్రొటోకాల్ పేరుతో తనను కట్టేశారని.. అందుకే జనంలో తిరగలేకపోయానని తెలియజేశారు. తాను సిఎం కూతురునైనా బిఆర్ఎస్ హయాంలో తన పనులు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సిఎం కెసిఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి వెళ్తానని, బిఆర్ఎస్ తో తనకు సంబంధం లేదని కవిత పేర్కొన్నారు.