ముంబై: సౌతాఫ్రికాఎతో జరుగుతున్న అనధికార టెస్టులో టీమిండియా ఎ జట్టు గెలుపు దిశగా దూసుకెళుతోంది. తొలి టెస్టులో భారీవిజయంతో ఆధిక్యంలో ఉన్న భారత్‌ఎ రెండో టెస్టులోనూ అదే జోరును కొనసాగిస్తోంది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(127 నాటౌట్) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగాడు. అతని తోడు జట్టు సారథి రిషభ్ పంత్(65 నాటౌట్) సయితం అర్ధ శతకంతో రాణించాడు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 382/-7వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు శనివారం ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 25 పరుగులు చేసింది. చివరిదైన నాలుగో రోజు ఆదివారం ప్రత్యర్థి బ్యాటర్లను ఆటకట్టిస్తే సునయాస విజయం ఖాయం. తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్ (132 నాటౌట్) సెంచరీతో గాడిలోపడిన భారత్.. బౌలర్ల విజృంభణతో సఫారీలను 221కే ఆలౌట్ చేసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలమైనా.. జురెల్ మెరుపు శతకంతో జట్టును మరోసారి గట్టెక్కించాడు. 17 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన పంత్.. హర్ష్ దూబే(84) వికెట్ పడ్డాక బ్యాటింగ్ వచ్చి చెలరేగాడు. జురెల్‌తో కలిసి స్కోర్ బోర్డును ఉరికించిన పంత్.. సిక్సర్‌తో అర్ధ శతకం సాధించాడు. అప్పటికే ఆధిక్యం 400 మార్క్ దాటింది. టైమింగ్ కుదరక పంత్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. దీంతో 382/-7 వద్ద భారత ఏ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, 416 పరుగుల భారీ లక్షాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. అనంరతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీఏ జట్టు ఆట ముగిసేసరికి 25 పరుగులు చేసింది. ఓపెనర్లు జొర్డాన్ హెర్మన్(15 నాటౌట్), లెసెగో సెనొకెవెనె(9 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంతిలో చెలరేగిన ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సిరాజ్‌లు మరోసారి రాణిస్తే.. సౌతాఫ్రికా బ్యాటర్లు కట్టడి చేయడం తేలికే.