టోక్యో: జపాన్ దేశంలో భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. ఉత్తర జపాన్‌ను ఆదివారం సాయంత్రం భారీ భూకంపం వణికించింది. 6.7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో అనేకసార్లు ప్రకంపనలు సంభవించాయి. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో దాదాపు 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని ఏజెన్సీ తెలిపింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో రెండు అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి.
భూకంపం వచ్చిన వెంటనే ఉత్తర తీవ్ర ప్రాంతాలను 1 మీటర్ (3 అడుగుల) ఎత్తు వరకు సునామీ అలలు తాకవచ్చని ఏజెన్సీ హెచ్చరించింది. జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ (ఎన్‌హెచ్‌కె) ప్రజలు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. ఎందుకంటే ఎప్పుడైనా సునామీ అలలు రావచ్చని తెలిపింది. ఎన్‌హెచ్‌కె కూడా ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు తాకవచ్చని హెచ్చరించింది.