హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించాలని నిరుద్యోగులు తిరుగుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి కొత్త నోటిఫికేషన్ ఒక్కటైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిజిఆర్ ను చంపిందే కాంగ్రెస్ పార్టీ అని 2004 నుంచి 2014 వరకు స్వర్ణయుగం అని సిఎం అన్నారని ఎద్దేవా చేశారు. సిఎం సొంత జిల్లాలోనూ ఆకలిచావులు మర్చిపోయారా? అని మాజీ సిఎం కెసిఆర్ ఏం చేశారో అధికారులను అడిగి తెలుసుకోవాలని అన్నారు. కార్పొరేట్ తో పోటీపడి కెసిఆర్ పేదలకు విద్య అందించారని, తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిందే కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అని జగదీష్ రెడ్డి కొనియాడారు. ఉచిత బస్సు పేరు చెప్పి అసలు బస్సులే లేకుండా చేశారని, మహిళలకు ఉచితమన్నారని.. మగవాళ్లకు ఛార్జీలు డబుల్ చేశారని విమర్శించారు. కెసిఆర్ కుటుంబ సమస్యల గురించి సిఎం మాట్లాడారని, కెసిఆర్ కుటుంబ విషయాలతో పార్టీకి ఏం సంబంధం? అని నిలదీశారు. సిఎం అన్న కుమార్తె పెళ్లికి.. సిఎం భార్య, ఆయన కుమార్తె ఎందుకెళ్ల లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.