హైదరాబాద్: పత్తి కొనుగోళ్లపై సిసిఐ సిఎండి లలిత్‌కుమార్ గుప్తాతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణలో పత్తి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన లలిత్‌కుమార్‌కి ఫోన్‌లో వివరించారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పరిమితిపై చర్చించారు. ఆ నిబంధనను ఎత్తివేసి పాత విధానంలోనే సిసిఐ పత్తి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కపాస్ కిసాన్ యాప్‌ను 24 గంటలు అందుబాటులో ఉంచాలని కోరారు. పత్తి మిల్లులన్నీ వెంటనే తెరిచేలా చర్యలు తీసుకోవాలని.. 20 శాతం తేమ ఉన్న పత్తిని సిసిఐ కొనేలా చర్యలు చేపట్టాని విజ్ఞప్తి చేశారు.