తమిళ స్టార్ హీరో తళపతి విజయ్ ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. చివరిగా ‘జననాయగన్’ అనే సినిమాలో నటించి.. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లాలని విజయ్ నిర్ణయించుకున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వినోద్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ రోర్‌కి మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘తళపతి కచేరీ’ అంటూ తొలి సింగిల్‌ని విడుదల చేశారు. యధావిధిగా అనిరుధ్ ఈ పాటకు మాస్ బీట్ అందించాడు. విజయ్, జనాలతో వేసిన స్టెప్స్ సింపుల్‌గా ఉన్నా.. అభిమానులకు కను విందు చేసేలా ఉన్నాయి. విజువల్స్ కూడా చాలా గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది.