మన తెలంగాణ/హైదరాబాద్ : గత వారం రోజుల వరకు రాష్ట్రాన్ని వరుణుడు వణికిస్తే, కొద్ది విరామం తరువాత రాష్ట్రంలో చలి పంజా విసరడం మొదలయింది. గత రెండు రోజులుగా చలి తీవ్రతో రాష్ట్రంలోని పలు జిల్లాలు వణికిపోతున్నాయి. ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే రాబోయే రోజులు ఏవిదమయిన ఉష్ణోగ్రతలు ఉంటాయోన ని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా రా ష్ట్రంలో రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా బేలలో అతితక్కువగా 14.7 డిగ్రీలు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో 14.7 ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో పాటుఆదిలాబాద్‌లోని భీమ్‌పూర్ 14.7, సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో 14.8, వికారాబాద్ 14.8, కొమరంభీంలో 14.8, శంకర్‌పల్లి 14.9, మొయినాబాద్ 15,
, సంగారెడ్డిలోని జిన్నారంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శేరిలింగంపలి, రాజేంద్రనగర్, హెచ్‌సీయూలో 15.3, రామచంద్రాపురం, పఠాన్‌చెరువు, బీహెచ్‌ఈఎల్‌లో 15.5, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్‌లో 15.7, చందానగర్ 15.9, బేగంపేట 16.4, మల్కాజ్‌గిరి, అల్వాల్ 17.1, గాజులరామారం 17.4, గోషామహాల్, కార్వాన్ 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కాగా, ఆదివారం మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని డిజిడిజిఎస్ వెల్లడించింది.
మూడు రోజులు మరింత తగ్గే అవకాశం
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని టిజిడిపిఎస్ వెల్లడించింది. కొమరం భీం జిల్లాలో అత్యధికంగా 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు ఆదివారం కామారెడ్డిలో 13.7, మెదక్‌లో 14.5, రంగారెడ్డిలో 14.8, ఆదిలాబాద్‌లో 13.5, నిజామాబాద్‌లో 13.9, వికారాబాద్‌లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాష్ట్ర ప్లానింగ్ డెవలెప్‌మెంట్ ప్లానింగ్ సోసైటీ పేర్కొంది.