రామ్‌చరణ్, జాన్వీ కపూర్‌లు హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. గ్రామీణ ప్రాంతంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను రూపొందించారు బుచ్చిబాబు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ‘ఫస్ట్ షాట్’కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘చికిరి చికిరి’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే ఈ పాట సంచలనం సృష్టించింది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా ఇది రికార్డుల్లోకెక్కింది.
24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన తొలి సాంగ్‌గా రికార్డు నెలకొల్పింది. అలాగే కేవలం 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్ సాధించింది. గతంలో 24 గంటల్లో 32 మిలియన్ల వ్యూస్ సాధించిన పాట రికార్డును ఇది బద్దలుకొట్టింది. అస్కార్ అవార్డు విజేత ఎఆర్ రహమాన్ ఈ పాటకు సంగీతం అందించగా.. మోహిత్ చౌహాన్ ఆలపించారు. బాలాజీ ఈ పాటకు లిరిక్స్ అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీ చేశారు. ఇప్పటికే ఈ పాటలోని స్టెప్స్‌పై కొందరు నెటిజన్లు రీల్స్ కూడా చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.