వరుసగా మూడో వారం కూడా బంగారం ధర తగ్గుతోంది. అమెరికా డాలర్ విలువ హెచ్చుతగ్గులు, అక్కడి ఫెడరల్ రిజర్వ్ ద్వారా కొనుగోళ్ల ప్రోత్సాహక పిలుపు వెలువడటంతో స్వర్ణం ధరలపై ప్రభావం పడుతోంది. ఇక మల్టీ కమోడిటి ఎక్సెంజ్ (ఎంసిఎక్స్) సూచీపై డిసెంబర్ పంపిణీకి బంగారం ధర గ్రాముకు రూ 165 లేదా 0.14 శాతం పడిపోయింది. గడిచిన వారం శుక్రవారం మార్కెట్ ధర పది గ్రాములకు రూ 1,21,067గా ఉంది. దీపావళి, దంతేరాస్ పర్వదినాల నేపథ్యంలో అక్టోబర్ చివరి వరకూ బంగారం ధర భారీగా పెరిగింది. అయితే ఇప్పుడు ఇది క్రమేపీ తగ్గుతోంది. అక్టోబర్ 17వ తేదీన అత్యధికంగా పది గ్రాములకు రూ 1.32 లక్షల వరకూ పలికిన బంగారం ధర ఇప్పుడు రూ 11వేల వరకూ తగ్గింది. బంగారం మార్కెట్ ఇప్పుడు స్తబ్ధత దశలో ఉందని విశ్లేషించారు. అమెరికా డాలర్ ఇతర విషయాల ప్రభావం ఉంటుందని ఫిక్స్‌డ్ ఇన్‌కం టాక్స్ అసెట్స్, ఎల్‌జిటి వెల్త్ ఇండియా సిఐఒ చిరాగ్ దోషి తెలిపారు. అమెరికాలో సుదీర్ఘ స్థాయి షట్‌డౌన్ ఇప్పుడు రెండో నెలలోకి చేరింది. దీనితో ఆర్థిక రంగం అనిశ్చిత పరిస్థితి నెలకొంది. డాలర్ ఆటుపోట్ల పరిస్థితి ఏర్పడింది.