మన తెలంగాణ/హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధుల తో శుక్రవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సిఎం భ ట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చ ర్చలు జరిపారు. ప్రభుత్వ హామీల పట్ల ప్రైవేట్ క ళాశాలల యాజమాన్యాలు సానుకూలంగా స్పం దించాయి. అన్ని నిరసన కార్యక్రమాలు అన్ని ర ద్దు చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) ప్రకటించింది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ వృత్తి విద్య,
డిగ్రీ కాలేజీలు ఈనెల 3 నుంచి బంద్ చేపటా యి.ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో కళాశాలలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. ప్రైవే ట్ కాలేజీల యాజమాన్యాలు అడిగిన రూ. 1,500 కోట్లలో రూ. 600 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని, మరో రూ. 600 కోట్లు వెంటనే వి డుదల చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమా ర్క ప్రకటించారు. మిగిలిన రూ. 300 కోట్లు త్వ రలో క్లియర్ చేస్తామని వెల్లడించారు. ఫీజు రి యంబర్స్‌మెంట్‌కు సంబంధించి ఒక కమిటీ వే యాలని కళాశాలల యాజమాన్యాలు అడిగాయ ని, త్వరలో ఒక కమిటీ ఏర్పాటు చేసి త్వరితగతిన కమిటీ నివేదిక వచ్చేలా చేస్తామని అన్నారు. ఏ రకమైన సంస్కరణలు అవసరమో చర్చిస్తామ ని, ఆ కమిటీలో అధికారులతో పాటు యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం కల్పిస్తామన్నారు.
ప్రభుత్వంతో తమ చర్చలు సఫలం కావడంతో అన్ని నిరసన కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు ఫతి చైర్మన్ నిమ్మటూరి రమేష్ ప్రకటించారు. సాం త్వన సభను సైతం రద్దు చేసినట్లు ఫతి జనరల్ సె క్రటరీ రవికుమార్ ప్రకటించారు. తామ మాటల ను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని పేర్కొన్నారు. విద్యాశాఖ కార్యదర్శి దేవసేనను కానీ, సిఎం కార్యాలయం అధికారులపై, డిప్యూ టీ సిఎం ఆఫీసు అధికారులపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.