అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో సోమవరం వద్ద కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి విద్యార్థులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సు షెల్టర్‌లో విద్యార్థులు ఉండగా వారిపైకి కారు దూసుకెళ్లింది. కారు ముందు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. స్థానిక ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.