బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా జరగాల్సిన ఐదో టి-20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకొని భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌లు భారత్‌కు శుభారంభాన్ని అందించారు. 4.5 ఓవర్లలో వీరిద్దరు కలిసి 52 పరుగులు చేశారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ అంతర్జాతీయ టి-20ల్లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో (528) ఈ రికార్డు సాధించిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ ఫీట్‌ని అభిషేక్ 28 ఇన్నింగ్స్‌లో సాధించాడు. అప్పుడే ఆకాశం మేఘావృతం కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత భారీగా వర్షం కురవడం మొదలైంది. చాలాసేపు నిరీక్షించిన తర్వాత మ్యాచ్‌ని రద్దు చేశారు. దీంతో ఈ సిరీస్‌లో 2-1 తేడాతో భారత్ విజయం సాధించింది.