మన తెలంగాణ/హైదరాబాద్ : ఇల్లు కూల్చేస్తామని బెదిరిస్తూ బిఆర్‌ఎస్ నాయకులను బ లవంతంగా రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేర్చుతున్నారని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కొం తమంది ఆకు రౌడీలు, గుండాలతోపాటు కొం తమంది పోలీసులు కూడా ఎగిరెగిరి పడుతున్నారని, వాళ్ల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. 500 రోజుల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రా బోతుంది.. ఒక్కొకరి పేరు రాసి పెట్టుకుంటున్నానని, ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నవారిని రేవంత్ రెడ్డి కాదు,వాళ్ల తాత దిగొచ్చినా కాపాడలేరని అన్నారు. హిట్లర్ వంటి నియంతకు కూడా పతనం తప్పలేదని.. రేవంత్ రెడ్డి ఒక లెక్కనా అని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ కాం గ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా బిఆర్‌ఎస్ నేతల మీద కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శనివారం ఎర్రగడ్డ డివిజన్‌లో కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారుకు, బుల్డోజర్‌కు జరుగున్న ఎన్నిక అని, ఈ ఎన్నికలో కారు గెలిస్తే పేదల ఇళ్లకు బుల్డోజర్ రాదు అని పేర్కొనారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్ ఎప్పుడు వస్తదో తెలియని పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. కత్తి ఒకరికి ఇచ్చి తమను యుద్ధం చేయమంటే సాధ్యం కాదు అని, ఈ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి సునీతను గెలిపిస్తే తాము ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టలేదు.. కానీ, హైడ్రా పేరు మీద వేల ఇండ్లు కూలగొట్టిందని మండిపడ్డారు. హైడ్రా భూతం, హైడ్రా రాక్షసి పోవాలంటే బిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
కేవలం పేదలను లక్ష్యంగా చేసుకుంటూ వారి ఇళ్లను కూలగొడుతున్న హైడ్రా బుల్డోజర్ పేద వాళ్ళ ఇంటికి, బస్తీల జోలికి రావద్దంటే ఈనెల 11వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైడ్రా ఇండ్లను కూల్చిన సందర్భంగా పేదల పడిన బాధలను కెటిఆర్ తన రోడ్డు షోలో అందరికీ అర్థం అయ్యేలా ఎల్‌ఇడి స్క్రీన్‌లపై చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. వేల మంది ఇండ్లను కూలగొట్టి.. గూడు లేకుండా చేశారని పేర్కొన్నారు. హైడ్రా ప్రతాపమంతా గరీబోళ్ల మీదనే ఉంటుందని, హైడ్రా భూతం పోవాలంటే, హైడ్రా రాక్షసిని తరిమికొట్టాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
అభివృద్ధి పేరుతో మరోసారి కాంగ్రెస్ మోసానికి చేరలేపింది
అభివృద్ధి పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెస్ మళ్లీ సిద్ధం అయ్యిందని కెటిఆర్ హెచ్చరించారు. ఇదే పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. మళ్లీ మోసపోకుండా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. ఈ నెల 14న రాష్ట్రంలో పెను తుఫాను రాబోతోందని చెప్పారు. రెండేళ్లలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధమయ్యారని తేల్చిచెప్పారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. అభివృద్ధి అంటూ కాంగ్రెస్ చెబుతున్న మాటలన్నీ అబద్దమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఒక్కసారి ఓటేసిన పాపానికి ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో కెసిఆర్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని గుర్తు చేశారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి రూ.లక్ష ఇచ్చారని.. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డ పుడితే రూ.12 వేలు.. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు అందించామని చెప్పారు. అభివృద్ధిలోనూ తెలంగాణను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ఘనత బిఆర్‌ఎస్‌దేనని స్పష్టం చేశారు.
యాపిల్, గూగుల్. అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు నగరానికి వచ్చాయని.. వాటి ద్వారా లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పెరిగాయని తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించామని అన్నారు. కానీ, కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్‌తో పాటు హోటళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు పడిపోయాయని వెల్లడించారు. కాంగ్రెస్ నిర్వాకం వల్ల ఆటో అన్నల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. గతంలో రెండు వేలు వచ్చే ఆదాయం.. వెయ్యికి పడిపోయిందని తెలిపారు. దీనివల్ల ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. మహిళలకు తులం బంగారం ఇస్తామని.. మెడలో ఉన్న గొలుసులు కూడా లాక్కుంటున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌ను ఓడించడమే వీటన్నింటికి పరిష్కారమని అన్నారు. ఈ నెల 11న ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి.. కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.