బ్రిస్బేన్: గబ్బా స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టి20లో మ్యాచ్‌లో టీమిండియా 4.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 52 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మ్యాచ్ జరుగుతుండగా వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. శుభ్‌మన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులు, అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 పరుగులు చేశాడు.