క్వీన్స్‌ల్యాండ్: ఆస్ట్రేలియాతో జరుగుతు ఐదు టి-20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. నాలుగో టి-20లో భారత్ విజయం సాధించడంలో శుభ్‌మాన్ గిల్ పాత్ర కూడా ఉంది. ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో 46 పరుగులు చేశాడు. దీంతో అతని స్ట్రైక్ రేటుపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మద్దతు ఇచ్చారు.
‘‘శుభ్‌మాన్ నిర్లక్ష్యపూరిత షాట్లు ఆడటం లేదు. హిట్టింగ్ కంటే కూడా తన టైమింగ్‌పై దృష్టి పెడుతున్నాడు. ఇలా ఆడే అతడు బౌండరీలు సాధించాలని అనుకుంటున్నాడు. అది అతడి స్టైల్. గిల్ ఒత్తిడిలోనూ చక్కగా బ్యాటింగ్ చేశాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. భారీ షాట్లు ఆడాడు. ఓ రెండు సిక్సులు కొట్టాడు. మంచి స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. అలాగే గిల్‌కు సొంత పద్ధతి, స్టైల్ ఉన్నాయి’’ అని పఠాన్ అన్నారు.