అమరావతి: సిఎం క్యాంపు కార్యాలయంలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ను టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కలిశారు. ప్రపంచ కప్ గెలిచిన టీమ్‌లో శ్రీచరణి ప్లేయర్ ఉండడంతో ఆమెను బాబు, లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను చంద్రబాబు, లోకేష్ తో శ్రీచరణి పంచుకున్నారు. ప్రపంచ కప్‌లో టీమిండియా విజయం సాధించి సత్తా చాటిందని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు ప్రశంసించారు. గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్న ఘన స్వాగతం పలికారు.