రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం వెళ్తున్న లారీ ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. బైక్‌పై వెళుతున్న వ్యక్తి మంటలను గమనించి లారీ డ్రైవర్‌కు చెప్పడంతో వెంటనే అపి దిగిపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం..మల్కాజ్‌గిరి నుండి సజ్జ గింజల లోడుతో వస్తున్న గూడ్స్ లారీ కర్నాటకకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శంషాబాద్ వద్ద ఫ్లైఓవర్‌పై నుండి వెళ్తోంది.ఆ సమయంలో ఇంజన్‌లో నుండి మంటలు చెలరేగాయి.
అదేసమయంలో బైక్‌పై వెళుతున్న ఒక వ్యక్తి ఈ మంటలను గమనించి లారీ డ్రైవర్ మహమ్మద్ సద్దాంకు చెప్పాడు. దీంతో సద్దాం లారీని అక్కడే అపేసి కిందకు దిగిపోయాడు. వెంటనే ఫైర్ స్టేషన్ నెంబర్ కు ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. 722 సజ్జగింజల బస్తాల్లో దాదాపు 150 బస్తాలు మంటల్లో కాలిపోయాయి. లారీ ఇంజన్ ముందుభాగం కూడా పూర్తిగా దగ్ధంమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.