వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల విషయంలో సంచలన ప్రకటన చేశారు. డయాబెటిస్, ఒబెసిటీ (ఊబకా యం) ఉన్నవారికి వీసా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈమేరకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ నిబంధనలు వెంటనే అ మలు చేయాలని ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాలకు ట్రం ప్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినట్టు అంతర్జాతీయ మీడి యా కథనాలు చెబుతున్నాయి. అమెరికా వీసా కోసం దరఖా స్తు చేసుకునే వారి ఆరోగ్య పరిస్థితిని ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలించేవారు. స్క్రీనింగ్ టెస్టుల ద్వారా క్షయవంటి అంటువ్యాధులు ఉన్నాయా లేదా అని తనిఖీ చేసేవారు. ఇప్పుడు తా జా నిబంధనల ప్రకారం డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే వారికి వీసా ఇచ్చే అవకాశం ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడేవారిని అమెరికాలోకి ఆహ్వానిస్తే భ విష్యత్తులో కొన్నిసమస్యలు తలెత్తుతాయని,
ఆ సమస్యలు ప్ర భుత్వ ఖజానాపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. కాబ ట్టి కొన్ని వ్యాధులున్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకపోతే సమస్యలకు చెక్ పెట్టినట్టే అవుతుంది. ఇలాంటివన్నీ ఆలోచించే డయాబెటిస్, ఊబకాయం ఉండే వారికి అమెరికా వీసా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. హృద్రోగ సమస్యలు, శ్వాససంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు,మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేడారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లను ఖ ర్చు చేయవలసి ఉంటుంది. ఇక ఒబెసిటీ కారణంగాఆస్తమా, స్లీ ప్‌ఆప్నియా, హైబీపీ వంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి రో గులకు సుదీర్ఘకాలం వైద్య చికిత్స అవసరం అవుతుంది. ఇది కు టుంబ సభ్యులపై ఆర్థిక భారం మోపుతుంది. దీనికి ప్రభుత్వం ఏదైనా సాయం అందించాలా? లేదా ప్రభుత్వ సాయం లేకుం డా కుటుంబ సభ్యులే ఆ ఖర్చును
భరించగలరా? అనే విషయంపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఇక కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అయితే ఈ వార్తలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించలేదు. వలసదారుల వల్ల అమెరికాలోఇబ్బందులు తలెత్తకూడదని ట్రంప్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది. విదేశీ విద్యార్థులు, ఎక్సేంజీ విజిటర్ల డ్యురేషన్ ఆఫ్ స్టేపై పరిమితి విధించడం, హెచ్1బీ వీసాపై వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలు వలసదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.