హైదరాబాద్: ఉన్నత విద్య ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీంతో బంద్ విరమిస్తున్నట్లు ఉన్న విద్యా ప్రైవేటు కళాశాలలు ప్రకటించాయి. డిప్యూటీ సిఎంతో చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో రేపటి నుంచి యధావిధిగా కళాశాలలు నడుస్తాయి. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు శుక్రవారం ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా ప్రైవేటు కలేజీలకు ఫీజు బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తక్షణమే రూ.600 కోట్లు విడుదలకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. త్వరలోనే మరో రూ.300 కోట్లు చెల్లిస్తామని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం రూ.600 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించింది.