బెంగళూరు: ఓ యువకుడిని ఓ యువతి గాఢంగా ప్రేమించింది. కానీ ఆమె ప్రేమను అతడు నిరాకరించడంతో అతడిపై పగ పెంచుకుంది. యువకుడిపై కసితో సోషల్ మీడియాలో అతడి పేరిట అకౌంట్లు ఓపెన్ చేసింది. పలు పాఠశాలలు, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో బాంబు పెట్టినట్టు యువకుడి సోషల్ మీడియా ఖాతా నుంచి బెదిరింపులకు పాల్పడింది. అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సదరు యువతి బిఇ ఎలక్ట్రానిక్స్ విద్యను పూర్తి చేసి ప్రభుత్వేతర సంస్థలో పని చేస్తున్నట్టుగా గుర్తించారు. ఐపి అడ్రస్ తెలుసుకొని ఆమెను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి పేరిట సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేస్తే అతడిని పోలీసులు అరెస్టు చేస్తారని ఆమె భావించింది. అహ్మదాబాద్ పోలీసుల అదుపులో ఉన్న ఆమెను బెంగళూరు పోలీసులు బాడీ వారెంట్‌పై యువతిని అదుపులోకి తీసుకున్నారు.