మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం సైతం చత్తీస్‌గఢ్ రాష్ట్రం, గరియాభంద్ జిల్లా, ఉదంతి ఏరియా కమిటీ సభ్యులు ఏడుగురు శుక్రవారం ఆయుధాదాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఉదంతి ఏరియా కమిటీ కమాండర్ సునీల్ సెక్రటరీ అరీనా ఉన్నారు. శనివారం వీరిని మీడియా ముందుకు తీసుకురానున్నారు. గత కొద్దిరోజుల క్రితం ఉదంతి ఏరియా కమిటీ కమాండర్ సునీల్ పేరిట మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. మల్లోజుల వేణుగోపాల్ బాటలోనే తాము కుడా లొంగిపోతామని లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిం. శుక్రవారం మధ్యాహ్నం ఉదంతి అడవుల నుండి సునీల్, అరీనా, లుద్రో, విద్య, నందిని, మల్లేష్ ఆయన బృందం సభ్యులు గరియాబంద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎల్‌ఎల్‌ఆర్ 3 ఇన్సాస్, సింగలాట్, తుపాకులను ఈ సందర్భంగా పోలీసులకు అప్పగించారు.