రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టిసి బస్సును డిసిఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టిసి బస్సును వెనుక నుంచి అతి వేగంతో డిసిఎం వాహనం ఢీకొట్టింది. ప్రయాణికులు స్పల్నంగా గాయపడ్డారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.