హాంకాంగ్ సూపర్ సిక్సెస్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ఘన విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఈ మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఆ భారత బ్యాటింగ్‌లో ఊతప్ప 28, భరత్ చిప్లి 24, దినేశ్ కార్తీక్ 17(నాటౌట్) పరుగులు చేశారు. 87 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది పాకిస్థాన్. మూడు ఓవర్లు ముగిసేసరికి వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. తిరిగి ఆట కొనసాగే పరిస్థతి లేకపోవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బ్యాటింగ్‌లో ఖవాసా నఫే 18, అబ్దుల్ సమద్ 16 పరుగులు చేశాడు. భారత బౌలంగ్‌లో స్టువర్ట్ బిన్నీ 1 వికెట్ తీశాడు.