మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు కేంద్రం ఏం చే సిందని కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు ప్రశ్నిస్తున్నాయని, నిజానికి ఒక్క హైదరాబాద్‌లోనే రూ.1.30లక్షల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. రైల్వే, జాతీయ రహదారులతో పాటు భారీ వంతెనాలు, ట్రిబుల్ ఆర్ తదితర ఎన్నో ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసి ని ధులు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎ న్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలపై స్ప ష్టత ఇవ్వకుండా ప్రతి దానికి ఉచిత బస్సు గురించే చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగితే వాటి గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉచిత బస్సు పథకం గురించి మాట్లాడుతూ అన్ని సమస్యలకు అదే పరిష్కారమన్నట్లు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చెప్పడం వారి మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నూతన పాలకవర్గం గురువారం నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’లో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఆ పార్టీతో కలిసి పని చేసే ప్రసక్తి లేదని అన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పరిమితమైందని గుర్తు చేశారు. భవిష్యత్తులో బిఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తి లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిది మూడో స్థానం అయితే, లోక్ సభ ఎన్నికలో రెండో స్థానానికి వచ్చామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల ప్రచార తీరుపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత, బీఆర్‌ఎస్‌పై నమ్మకం లేకపోవడంతో జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేకపోతున్నారని అన్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోరు జరుగుతోందని అన్నారు. ఈ గందరగోళం సర్వేల్లోనూ ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికల అంశంలో సర్వేల్లో స్పష్టత లేదని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో జరిగే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ వెనుకబాటుకు బీఆర్‌ఎస్ బాధ్యత వహించాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
మంత్రులు తమ హామీల గురించి ప్రస్తావించకుండా బిజెపిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో ఎక్కువ వాటా కేంద్రానిదేనని, ఆ పథకాన్ని ఆపేస్తామని సీఎం ఎలా అంటారని ప్రశ్నించారు. రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యంలో ప్రతి కిలోకి రూ.42 కేంద్రం భరిస్తోందని, సన్నబియ్యం అంటూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని దానికి కలపడం వల్ల మరో రూ.15 అదనంగా చెల్లిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏమీ ఖర్చు చేయడం లేదని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి కూడా నిధులు లేవని విమర్శించారు.
మజ్లిస్ మెప్పు కోసం ముఖ్యమంత్రి తహతహ
రాష్ట్రంలో ఏం చేయాలన్నా మజ్లిస్‌ను అడిగి, వారి మెప్పు పొందిన తర్వాతే చేస్తున్నారని కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ’ఇజ్జత్’ అంటావు, మరి హిందువులు ఇజ్జత్ కాదా రేవంత్‌రెడ్డి అని ప్రశ్నించారు. ఎర్రగడ్డలో ఖబర్‌స్తాన్‌కు స్థలం కేటాయించడం సరైనదేనా అని ప్రశ్నించిన ఆయన బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాల స్థలం ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. హిందువులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ అనుబంధాన్ని ఎంతకాలం కొనసాగిస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తన పరిధిలో విచారణ చేయకుండా బీజేపీపై ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ తో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై సీబీఐ కేసు నమోదు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై కిషన్ రెడ్డి స్పందిస్తూ దీనిపై కేంద్రం దర్యాప్తునకు సిద్ధంగా ఉందని చెప్పారు. బోరబండలో పాదయాత్ర చేస్తే ఎంత మేర అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని అన్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం బాధ్యత వహిస్తుంది
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం బాధ్యత వహిస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం ఏం చేయాలో అవన్నీ చేస్తుందని అన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్ ఉంటుందని, అంతేకాని తెలంగాణకు ఒకటి, ఆంధ్రాకు ఒకటి, కేరళ, తమిళనాడుకు ఒక బడ్జెట్ ఉండదని అన్నారు. అయితే అక్కడ ఉన్న ప్రాధాన్యతలను బట్టి కొన్ని చేయాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులకు సంబంధించి భూ కేటాయింపుల కోసం 40 ఉత్తరాలు రాశానని, అయినా ఒక్కదానికి సమాధానం రాలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 101 అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ పరిధిలో జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీబీనగర్ ఎయిమ్స్ శాశ్వత భవనాలను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తారని తెలిపారు. తాను కేంద్రమంత్రిగా హైదరాబాద్‌కే కాకుండా తెలంగాణకు ఏది అవసరమో దాని కోసం ప్రయత్నించి వీలైనన్ని ప్రాజెక్టులు తెచ్చామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.