వన్డే ప్రపంచకప్ ట్రోఫీ సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళా క్రికెట్ టీమ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.అయితే, ఈ భేటీ సందర్భంగా టీమిండియా స్టార్ క్రికెటర్ హర్లీన్ డియోల్ ప్రధాని మోడీని అడిగిన ఓ ప్రశ్న అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరూ ఊహించని విధంగా హర్లీన్ ప్రధానినిఅనూహ్య ప్రశ్నను అడిగింది. మైక్ అందుకున్న డియోల్ ‘సర్, మీ స్కిన్ కేర్ ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. దీని వెనక ఉన్న రహస్యమెంటో మాకు చెప్పగలరా?’ అని ప్రశ్నించింది.
హర్లీన్ నుంచి ఊహించని ప్రశ్నకు ప్రధానితో సహా అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ప్రధాని దీనిపై చిరనవ్వుతో స్పందిస్తూ వాటి గురించి ఆలోచించను అంటూ సమధానం ఇచ్చారు. ఆ వెంటనే జట్టు సభ్యుల్లోని ఒక ప్లేయర్ స్పందిస్తూ ‘సర్, ఇది దేశంలోని కోట్లాది మంది ప్రేమ వల్లే’ అనగానే మరోసారి అందరూ సరదాగా నవ్వేశారు. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ స్పందిస్తూ చూశారా సర్ ఇలాంటి వారిని నేను డీల్ చేయాల్సి వచ్చిందన్నారు. అందుకే, నా జుట్టు త్వరగా తెల్లబడిపోయిందని అనేశారు.