క్వీన్స్‌ల్యాండ్: ఐదు టి-20ల సిరీస్‌ల భాగంగా కార్రరా కర్రారా ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టి-20లో భారత్ ఘన విజయం సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్ 48 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌లో 2-1 అధ్యిక్యంలోకి వచ్చింది భారత్. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.
ఆ తర్వాత లక్ష్య చేధనలో ఆసీస్ ఆరంభంలో ఆచితూచి ఆడింది. కానీ, భారత బౌలర్లు పట్టువదలలేదు. 91 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ని 119 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆసీస్ బ్యాటింగ్‌లో కెప్టెన్ మార్ష్ (30), టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మాథ్యూ షార్ట్ 25 పరుగులు చేశాడు. మిగితా వాళ్లేవ్వరూ 15+ స్కోర్ సాధించలేకపోయారు. ఇక భారత బౌలింగ్‌లో సుందర్ 3, అక్షర్, దూబే చెరి 2, బుమ్రా, అర్ష్‌దీప్, వరుణ్ తల ఒక వికెట్ తీశారు.